స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు

Narendra Modi speaking from Red Fort on August 15, 201670వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా – ఎర్రకోట బురుజుల నుండి – ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజల నుద్దేశించి చేసిన ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు . .

• ఈ రోజు పవిత్ర స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 125 కోట్ల దేశ ప్రజలకు, ప్రవాస భారతీయులకు నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

• ఈ 70వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశాన్ని కొత్త శక్తితో, కొత్త నిబద్దతతో, కొత్త అభిరుచితో, కొంగ్రొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలని తీర్మానించుకుందాం.

• మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వాతంత్య్రం వెనుక లక్షలాది మంది గొప్ప వ్యక్తుల అంకితభావం, త్యాగం, వీర గాధలు ఇమిడి ఉన్నాయి.

• వేదాల నుండి వివేకానందుని వరకు, ఉపనిషత్తులనుండి ఉపగ్రహాలవరకు, సుదర్శన చక్రధారి మోహన్ నుండి చర్కాధారీ మోహన్ వరకు అలాగే మహాభారత్ లో ప్రసిద్దుడైన భీమ్ నుంచి భీంరావు వరకు గొప్ప చరిత్ర, వారసత్వం మనకు ఉన్నాయి.

• భారతదేశం 70 ఎల్లా పాతది కాదు. మన యాత్ర 70 ఏళ్ళు సాగింది.

• స్వపరిపాలన నుంచి ఇప్పుడు సుపరిపాలన వైపు మళ్లాలన్నది 125 కోట్ల మంది దేశ ప్రజల తీర్మానం.

• ఇది పంచాయితీ కానీ పార్లమెంటు కానీ, గ్రామ ప్రధాన్ కానీ ప్రధానమంత్రి కానీ – అందరూ – ప్రతి ఒక్క ప్రజాస్వామ్య వ్యవస్థ తన బాధ్యతలను నిర్వర్తించాలి. సుపరిపాలన దిశగా తన బాధ్యతలు నిర్వర్తించాలి.

• భారత దేశానికి లక్షలాది సమస్యలుంటే – వాటిని పరిష్కరించే సామర్ధ్యం గల 125 కోట్ల మేదస్సులున్నాయి.

• పరిపాలన అనేది ప్రతిస్పందించేగా ఉండాలి. బాధ్యతాయుతంగా కూడా ఉండాలి.

• మీ కు గుర్తుండే ఉంటుంది. ఇదివరలో పెద్ద ఆసుపత్రికి వెళ్లాలంటే అతను కానీ, ఆమె కానీ, చాలా సేపు వేచి ఉండవలసి వచ్చేది.

• ఈ రోజున నిముషంలో 15 వేల రైలు టిక్కెట్లు తీసుకోవడం ఒక నిత్యకృత్యమైంది.

• విధానంలో సుపరిపాలన తీసుకురావడానికి సమర్ధతపై వత్తిడి తీసుకురావడం ఒక ముఖ్యమైన విషయంగా మారింది.

• గతంలో సిఫార్సు లేకుండా పాస్ పోర్టు పొందడానికి 4 నుంచి 6 నెలల కాలం పట్టేది. ఇప్పుడు ఒకటి లేదా రెండు వారాల్లో నువ్వు దాన్ని పొందవచ్చు.

• కేవలం 2015-16 సంవత్సరంలోనే ఒక కోటీ 75 లక్షల పాస్ పోర్టులు అతి తక్కువ కాలంలో జారీ అయ్యాయి. అవును. చేసి చూపించాము.

• ప్రభుత్వంలో గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాల భర్తీని ఇంటర్యూ పరిధి నుంచి మేము మినహాయించాము.

• ఇటువంటి 9 వేల ఉద్యోగాలకు ఇప్పుడు ఇంటర్యూ పద్దతి లేదు.

• పని వేగాన్ని పెంచాము. అయితే ఈ వేగాన్ని ఇంకా పెంచవలసి ఉంది.

• గతంలో ఒక రోజులో 70 నుంచి 75 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు నిర్మించేవారు. ఈ రోజు ఆ పని వేగం రోజుకు వంద కిలోమీటర్లకు పెరిగింది.

• పునరుద్ధరణ శక్తిపై మనం దృష్టి కేంద్రీకరించాలి.

• గత ఏడాది కాలంలో పవన విద్యుత్ ఉత్పత్తి 40 శాతం వరకు మనం పెంచగలిగాము.

• ఒక ఏడాదిలో 30,000 నుంచి 35,000 కిలోమీటర్ల మేర విద్యుత్ సరఫరా లైన్లు వెయ్యడం జరిగింది. ఈ రోజు మనం ఈ పనుల కొనసాగింపు లో భాగంగా 50,000 కిలోమీటర్ల వరకూ విద్యుత్ సరఫరా లైన్లు వేయగలిగాము.

• మన రైల్వే లైనుల ప్రారంభం గురించి మాట్లాడుకుంటే – ఈ రెండేళ్లలో 3,500 కిలోమీటర్ల మేర పని పూర్తి చెయ్యడంలో కృతకృత్యులయ్యాము.

• 60 వారాల్లో మనం 4 కోట్ల కొత్త కనెక్షన్లను ఇచ్చాము.

• మన గ్రామాల్లో 2 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించాము. దాదాపు 70,000 పైగా గ్రామాలు ఇప్పుడు బహిరంగ మలమూత్ర విసర్జన చేయని గ్రామాలుగా గుర్తింపు పొందాయి.

• గతంలో 350 రూపాయలకు విక్రయించిన బల్బులను ఇప్పుడు మేము 50 రూపాయలకే పంపిణీ చేస్తున్నాము. ప్రభుత్వ జోక్యం వల్ల ఇది సాధ్యమైంది.

• మేము ఇంతవరకు 13 కోట్ల బల్బులు పంపిణీ చేసాము. 77 కోట్ల బల్బులు పంపిణీ చేయాలని మేము గట్టిగా నిర్ణయించుకున్నాము.

• 20,000 కోట్ల మెగావాట్ల విద్యుత్ ఆదా అయ్యింది. అంటే ఒక లక్షా 25 వేల కోట్ల రూపాయలు ఆదా అయినట్లు.

• 20 వేల కోట్ల మెగావాట్ల విద్యుత్ ను మనం ఆదా చేయడం ద్వారా మనం గ్లోబల్ వార్మింగ్ కు వ్యతిరేకంగా ఉద్యమించగలం.

• మనం క్రమం తప్పకుండా తీసుకుంటున్న చర్యల వల్ల – ద్రవ్యోల్బణం రేటును 6 శాతానికి మించకుండా చేయగలిగాము.

• ద్రవ్యోల్బణం నియంత్రణకు మనకు సాధ్యమైనంత వరకు కృషి చేస్తున్నాము.

• పేదవారు భుజించే ఆహారం మరింత ప్రియం కావడాన్ని నేను అనుమతించను.

• భూమి ఆరోగ్య పరిరక్షణకు మేము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాము. భూ ఆరోగ్య కార్డు, నీటి యాజమాన్యం పై మేము ప్రత్యేక దృష్టి పెట్టాము.

• గత రెండేళ్లుగా కరవు పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశ ధాన్యాగారాన్ని నింపడంలో అలుపెరుగని కృషి చేస్తున్న నా రైతు సోదరులను నేను అభినందిస్తున్నాను.

• పప్పుధాన్యాలకు గరిష్ట అమ్మకపు ధరను మేము నిర్ణయించాము. బోనస్ కూడా ఇచ్చాము. పప్పుధాన్యాల కొనుగోలుకు ఒక చక్కని యాజమాన్య నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేశాము.

• నీటి యాజమాన్యం, సాగునీటి పారుదల, జల సంరక్షణకు మేము అధిక ప్రాధాన్యం ఇచ్చాము.

• ప్రతినీటి బొట్టుకూ అధిక పంట, సూక్ష్మ సాగునీటి పధకాలకు ప్రస్తుతం మేము అధికప్రాధాన్యం ఇస్తున్నాము. అసంపూర్ణంగా ఉన్న 90 పైచిలుకు సాగునీటి ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయాలని మేము ప్రతిపాదించాము.

• 77,000 సోలార్ పంపులను మేము పంపిణీ చేశాము.

• మన భూమిలో ప్రతి హెక్టారుకు అత్యధిక ఉత్పాదకతను ఇచ్చే 131 కొత్త విత్తన రకాలను మన శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు.

• గతంలో ఎరువుల కొరత ఉండేది. అయితే ఇప్పుడు అత్యధిక పరిమాణంలో ఎరువులు ఉత్పత్తి చేయడంలో మనం విజయం సాధించాము.

• ఫసల్ బీమా యోజన కింద అతి తక్కువ ప్రీమియంతో – అత్యధిక హామీని పొందడంలో మొదటిసారిగా మనం విజయం సాధించాము.

• 15 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వచేసుకోడానికి వీలుగా మనం గోదాములు నిర్మించుకున్నాము.

• వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఊతమిచ్చే విధంగా ఫుడ్ ప్రోసెసింగ్ నూర్ శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మేము ప్రోత్సహించాము.

• పారదర్శకతతో పరివర్తన, పూర్తి పరివర్తన సాధించాము. ప్రతిరంగంలో పనులను సక్రమంగా ముందుకు తీసుకువెళ్లేందుకు – సంస్కరణ, నిర్వహణ, పరివర్తన అనే సూత్రాన్ని పాటించడానికి మేము ప్రయత్నించాము.

• ప్రత్యేకించి అభివృద్ధి బదులు సమగ్ర అభివృద్ధిపై మేము దృష్టి పెట్టాము. అధికారానికి బదులు సాధికారతపైనే మేము దృష్టి కేంద్రీకరించాము.

• గత ప్రభుత్వం ప్రారంభించి, లేదా ప్రారంభించాలని తలచి, లేదా ప్రణాళికలు రూపొందించిన ఏడున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన సుమారు 118 ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండిపోయాయి. వాటిని నేను గుర్తించి, వాటిని పూర్తి చేయవలసిందిగా అధికారులను ఆదేశించాను.

• ప్రాజెక్టులను ఆపివేయడం, జాప్యం చేయడం, ధనాన్ని వృధా చేయడం నేరపూరిత నిర్లక్ష్యం. వాటిని అధిగమించాలని మేము ప్రయత్నించాము.

• రైల్వే ప్రాజెక్టులను ఇప్పుడు ఆరు నెలల్లో క్లియర్ చేస్తున్నాము. స్పష్టమైన మా విధానం, నిజాయితీతో కూడిన ఉద్దేశ్యాల వల్ల ఇది సాధ్యమైంది.

• వేల కోట్ల రూపాయల మేర చెఱకు రైతుల బకాయిలు పేరుకుపోయాయి. వీటిలో 95 శాతం మేర బకాయిలను మేము చెల్లించాము.

• 5 కోట్ల పేద కుటుంబాలకు గ్యాస్ పొయ్యిలు ఇవ్వాలని మేము సంకల్పించాము. వీటిలో 50 లక్షల కుటుంబాలకు మొదటి వంద రోజుల లోపు పొయ్యిలను అందజేయడం జరిగింది.

• తపాలా కార్యాలయాలను చెల్లింపు బ్యాంకులుగా మార్చడానికి చర్యలు చేపట్టాము. దీనివల్ల భారత దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు సేవలు విస్తరిస్తాయి.

• ప్రజలు ఇప్పుడు తమ జన్ ధన్ యోజన ఖాతాల ప్రయోజనాన్ని పొందగలుగుతున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం చెల్లింపులు ఆధార్ కార్డు ద్వారా వారి వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి.

• ఎయిర్ ఇండియా సంస్థను తిరిగి లాభాల బాటలోకి తీసుకురావడంలో విజయం సాధించాము. బి ఎస్ ఎన్ ఎల్ కూడా మొదటిసారిగా లాభాల లోకి అడుగు పెట్టింది. దీనికి తోడు షిప్పింగ్ కార్పొరేషన్ కూడా లాభాల్లోకి వచ్చింది.

• ఆధార్ వాళ్ళ మధ్యవర్తులు అందరూ బలవంతంగా బయటకు నెట్టి వేయబడ్డారు.

• స్పెక్ట్రమ్ వేలం ఆన్ లైన్ లోకి వచ్చింది. దీనివల్ల ఖజానా నిండింది. ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. తద్వారా దేశం ప్రయోజనం పొందింది.

• ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డి ఐ) విషయానికి వస్తే – భారతదేశం ఒక ఆకర్షణీయమైన గమ్యంగా మారింది.

• అలాగే – జి.డి.పి. వృద్ధి రేటు విషయానికి వస్తే – ప్రపంచంలోని పెద్ద పెద్ద ఆర్ధిక వ్యవస్థలను కూడా మనం అధిగమించాము.

• మన ఆర్ధిక వ్యవస్థను పటిష్టపరచడానికి జి.ఎస్.టి. ఒక శక్తివంతమైన పరికరంగా రూపొందింది.

• ఆడపిల్లలను రక్షించడానికీ, విద్యావంతులను చేయడానికీ మేము చేపట్టిన చర్యలకు సమాజం నుండి సహకారం లభించవలసి ఉంది.

• మూడున్నర కోట్ల మంది ప్రజలు ముద్రా యోజన ప్రయోజనాన్ని పొందారు. లబ్ధిదారుల్లో చాలా మంది మొదటి సారిగా బ్యాంకు ఖాతాదారులయ్యారు. వీరిలో 80 శాతం మంది షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన కులాలకు చెందినవారు ఉన్నారు. మొత్తం ఋణగ్రహీతల్లో 80 శాతం మంది మహిళలు ఉన్నారు.

• ప్రసూతి సెలవును 26 వారాలకు పెంచడం జరిగింది. దీనివల్ల తల్లులు తమ శిశువులను మరింత జాగ్రత్తగా రక్షించుకోడానికి అవకాశం ఉంటుంది.

• రైతులకోసం ఈ-నామ్ వ్యవస్థను మేము ప్రారంభించాము. దీనివల్ల రైతులు ఈ రోజున తమ ఉత్పత్తులను దేశంలోని ఏ మార్కెట్ కైనా విక్రయించుకునే అవకాశం ఉంటుంది.

• భారత్ మాల, సేతు భారతం, భారత్ నెట్ వంటి అనేక ప్రాజెక్టులకు కొత్త ఊపునిచ్చాము.

• ఎటువంటి వివక్ష లేకుండా – ప్రజలందరికీ సేవ చెయ్యాలని రామానుచార్యజీ చెబుతూ ఉండేవారు. వారి వయస్సు, లేదా కులం ప్రాతిపదికగా ఎవరినీ నిరాకరించ కూడదు. అందరినీ గౌరవించాలి.

• యువత ఆకాంక్షలు నెరవేర్చడానికి మేము అనేక చర్యలు చేపట్టాము.

• భారతదేశం ఈ రోజు అత్యధిక మొత్తంలో “సాఫ్ట్ వేర్” ఎగుమతులు చేస్తోంది. 50 కి పైగా కొత్త మొబైల్ కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. ఇవి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి.

• ఒకే హోదా – ఒకే పింఛన్ పధకం వల్ల మన రక్షణ సిబ్బంది కుటుంబాలన్నింటిలో సంతోషాన్ని నింపింది.

• నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు చెందిన దస్త్రాలను బహిర్గతం చేయడం జరిగింది.

• పార్లమెంటు రియల్ ఎస్టేట్ బిల్లును ఆమోదించింది. దేనివల్ల రియల్ ఎస్టేట్ రంగం నియింత్రించబడింది. మధ్య తరగతి ప్రజలు ఇల్లు నిర్మించుకోడానికి ఎదురౌతున్న అవాంతరాలు తొలగిపోయాయి.

• భిన్నత్వంలో ఏకత్వం మన శక్తి, ఐకమత్యం భావన మన సమాజంలో నాటుకుపోయి ఉంది.

• ఎలా గౌరవించాలో మనకు తెలుసు. ఆతిధ్యం ఎలా ఇవ్వాలో, వారిని మన స్వంత మనుషులుగా ఎలా చూడాలో మనకు తెలుసు. ఇది మనలో నిబిడీకృతమై ఉన్న గొప్ప సంప్రదాయం. అందువల్లే మన దేశంలో హింసకూ, అత్యాచారాలకూ తావు లేదు. మన దేశం హింసనూ, తీవ్రవాదాన్నీ సహించదు. తీవ్రవాదానికీ, మావోయిజానికీ ఈ దేశం ఎప్పటికీ తలవంచదు.

• పేదరికానికి వ్యతిరేకంగా పోరాడితేనే – మనం శ్రేయస్సు వైపు ముందుకు వెళ్ళగలం. ఈ దిశగా చర్యలు తీసుకోవలసిందిగా నేను పొరుగు వారికి పిలుపునిస్తున్నాను.

• బలూచిస్తాన్, గిల్గిట్, పాకిస్తాన్ ఆక్రమిత కాస్మీర్ ప్రజలు నన్ను ప్రశంసించిన విధానం – నా దేశంలోని 125 కోట్ల మంది ప్రజల గౌరవాన్ని ఇనుమడింపజేసింది.

• స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు పింఛను 20 శాతం పెంచాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది.

• ధైర్య సాహసాలు ప్రదర్శించిన గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల జ్ఞాపకాలతో – ఒక ప్రదర్శనశాలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.

• పేద కుటుంబాలకు లక్ష రూపాయల వరకూ వైద్య చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది.

• ఒకే సమాజం, ఒకే స్వప్నం, ఒకే తీర్మానం, ఒకే దిశా, ఒకే గమ్యం – ఇదే మన మార్గదర్శక స్ఫూర్తి.

భారత మాతా కీ జై , వందేమాతరం , జై హింద్ …

Collected & Translated by Ponangi Bala Bhaskar

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *