2016 AUG 23 Latest News in Telugu from Hyderabad by Bala Bhaskar

ఈ రోజు (23-08-2016) మంగళవారం …
నేను సేకరించి … మీ కోసం కూర్చిన … వార్తావిశేషాలు …

….. గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై ఆనకట్టలు నిర్మించే అంశానికి సంబంధించి – తెలంగాణా, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య – మూడు ఒప్పందాలు కుదిరాయి. ముంబాయి లో జరిగిన – గోదావరి అంతర్ రాష్ట్ర మండలి సమావేశంలో – తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర శేఖర రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ – ఈ ఒప్పందాలపై – సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చంద్ర శేఖర రావు మాట్లాడుతూ – తెలంగాణా, మహారాష్ట్ర – ఈ ఒప్పందం కుదుర్చుకుని దేశంలోనే – ఒక కొత్త అధ్యాయానికి తెర తీశాయని చెప్పారు. కేంద్రం జోక్యం లేకుండానే – ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవటం – శుభ పరిణామం అని – చంద్ర శేఖర రావు పేర్కొన్నారు.

….. ఈ ఒప్పందం తర్వాత – తెలంగాణ ప్రభుత్వం మూడు బ్యారేజీలు – మహారాష్ట్ర రెండు బ్యారేజీల నిర్మాణం చేపట్టనున్నాయి. కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద – ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే బ్యారేజీలు – పూర్తిగా తెలంగాణకు సంబంధించినవి కాగా – మిగిలిన మూడు ప్రాజెక్టులను – రెండు రాష్ట్రాలు సంయుక్తంగా నిర్మిస్తాయి.

….. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణానికి – మహారాష్ట్ర ప్రభుత్వంతో – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంతో – తెలంగాణ సచివాలయంలో – సిబ్బంది – సంబురాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట – బాణసంచా కాల్చుతూ జరుపుకొన్న సంబురాల్లో – హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి – తదితరులు పాల్గొన్నారు.

….. హరితహారంలో భాగంగా – రాష్ట్రంలోని జాతీయ రహదారులతో సహా – అన్ని రహదారుల వెంబడి – మొక్కల పెంపకం చేపడుతున్నట్లు – తెలంగాణా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు – తెలిపారు. ఆయన – ఈ రోజు – ఢిల్లీ లో మాట్లాడుతూ.. నేషనల్‌ గ్రీన్‌ పాలసీ కింద – మొక్కల పెంపకానికి – అటవీశాఖ తరపున – 1160 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు చేయాలని – కేంద్రాన్ని కోరినట్లు – చెప్పారు.

….. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే – దేశం అభివృద్ధి చెందుతుందని – కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు అన్నారు. నంద్యాల-ఎర్రగుంట్ల మధ్య నూతన రైలు మార్గాన్ని – ఆయన – ఈ రోజు – విజయవాడలో – రిమోట్‌ ద్వారా ప్రారంభించారు. నంద్యాల నుంచి ఎర్రగుంట్ల వరకు – 123 కిలోమీటర్ల మేర – ఈ రైల్వే లైన్‌ను – 967 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ లైన్‌తో పాటు నంద్యాల-కడప మధ్య – డెమూ రైలును కూడా – సురేశ్‌ ప్రభు ప్రారంభించారు.

….. TDP LP ని – TRS LP లో విలీనం చేయటాన్ని సవాలు చేస్తూ TDP నాయకుడు రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై – హై కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. హై కోర్టు – తన తీర్పు ను – రిజర్వు లో ఉంచింది.

….. మహారాష్ట్ర తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిరసిస్తూ – కాంగ్రెస్ పార్టీ – హైదరాబాదు లో గాంధీ భవన్ నుండి – హైదరాబాదు కలెక్టర్ కార్యాలయం వరకు – పాద యాత్ర నిర్వహించింది.

….. కౌలు రైతులందరికీ రుణ అర్హత కార్డులు ఇవ్వాలని – CPM – తెలంగాణా ప్రభుత్వాన్ని – డిమాండు చేసింది.

….. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి M వెంకయ్య నాయుడు – ఈ ఉదయం – విజయవాడ లో – ఆకాశవాణి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ – విశ్వసనీయత కు ప్రాధాన్యం ఇవ్వాలననీ – వార్తలను వేగంగా ప్రజలకు చేరవేయాలనీ – సూచించారు.

….. తెలంగాణా లో నూతన జిల్లాల ఏర్పాటు – ప్రజాభిప్రాయం మేరకు జరగాలని – రాజకీయ సంయుక్త కార్యాచరణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం – అన్నారు.

….. అమరావతి లో బాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు – సింధు కోచ్ – పుల్లెల గోపీచంద్ కు – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – 15 ఎకరాల భూమి కేటాయిస్తుందని – ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు – చెప్పారు.

… తెలుగు రాష్ట్రాలలో – కృష్ణా పుష్కారాలు నేటి తో – ముగియనున్నాయి.

….. కృష్ణా పుష్కరాల సందర్భంగా – కేంద్రమంత్రులు సురేశ్‌ప్రభు – వెంకయ్యనాయుడు – ఈ సాయంత్రం – కృష్ణా నదిలో – పుష్కర స్నానం చేశారు.

….. GST సవరణ బిల్లు కు – గుజరాత్ శాసన సభ – ఆమోదం తెలిపింది.

….. మూడు లక్షల రూపాయలకు మించి నగదు బదిలీలు ఉండరాదనీ – అంతకుమించి ఎక్కువ వున్న వాటి పై నిషేధం విధించాలన్న సిఫార్సులను పరిశీలిస్తున్నట్లు – కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు – తెలిపింది.

….. పొరుగుదేశం పాకిస్థాన్‌ పై – వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన – కన్నడ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు రమ్యపై – దేశద్రోహం కేసు నమోదైంది.

….. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం – విజయవాడలో – బాడ్మింటన్ క్రీడాకారిణి PV సింధు కు – పౌర సత్కారం నిర్వహించింది. ఈ సందర్భంగా – ఇతర ప్రముఖ క్రీడాకారులు – కిడాంబి శ్రీకాంత్ – కోనేరు హంపి – సత్తి గీత తదితరులను కూడా – ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు – సత్కరించారు. ఈ సందర్భంగా – ముఖ్యమంత్రి మాట్లాడుతూ – అమరావతి ని – క్రీడల కేంద్రం గా అభివృద్ధి చేస్తామని – హామీ ఇచ్చారు.

….. బాంగ్లాదేశ్ శ్రోతల కోసం – ఆకాశవాణి కోల్ కతా కేంద్రం – మైత్రీ పేరిట ఏర్పాటు చేసిన రేడియో ఛానెల్ ను -రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ – ఈ రోజు – లాంఛనం గా ప్రారంభించారు.

….. దేశ రాజధాని దిల్లీలో – భారత వైమానిక దళం – కొత్తగా – ఒక ఏరోస్పేస్‌ మ్యూజియంను – ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో – దాదాపు 43 ఎకరాల విస్తీర్ణంలో – దీని నిర్మాణం జరగనుంది.

…. మహారాష్ట్ర ప్రభుత్వం – ముంబయి నగరంలో – 350 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు – మహారాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాజ్‌కుమార్‌ బడోలె – చెప్పారు.

….. ఈ రోజు – పది గ్రాముల బంగారం ధర 150 రూపాయలు పెరిగి – 31 వేల 2 వందల రూపాయలకు చేరింది. అలాగే కిలోగ్రాము వెండి ధర – 2 వందల రూపాయలు పెరిగి – 45 వేల 4 వందల రూపాయలకు చేరింది.

….. తెలంగాణలో సంచలనం కల్గించిన – ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీ కేసులో – C.I.D. అధికారులు – ఈ రోజు – తమిళనాడుకు చెందిన రాజశేఖర్‌ అనే వ్యక్తిని – అదుపులోకి తీసుకున్నారు.

….. రంగారెడ్డి జిల్లా – మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట – ఒక వ్యక్తి – అతివేగంగా కారు నడుపుతూ – ఇద్దరు విద్యార్థులను – ఢీ కొట్టగా – ఆ ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు – సమాచారం.

….. హైదరాబాద్ నాంపల్లి లోని – మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు, క్రిమినల్ కోర్టుల సముదాయం ప్రాంగణంలో – తొలి ఆదర్శ స్నేహ పూర్వక బాలల న్యాయస్థానం – రేపు – ప్రారంభం కానుంది.

….. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన – ఐఐటీల్లో విద్యార్థులు – ఒత్తిడి వల్ల చదువు మధ్యలో ఆపేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో – ఐఐటీల నిబంధనలు సడలించే యోచనలో ఉన్నట్లు – కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేవకర్‌ – తెలిపారు.

….. కేంద్ర కార్మిక సంఘాలు – పారిశ్రామిక స్థాయి సమాఖ్యలు – బీమా – రక్షణ – ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఇఛ్చిన పిలుపు మేరకు – సెప్టెంబర్ 2వ తేదీన జరిగే – జాతీయ స్థాయి సమ్మెలో – వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు, రిజర్వు బ్యాంకు సిబ్బంది – పాల్గొనాలని నిర్ణయించారు.

….. దళితులపై దాడి ఘటనలో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ – గుజరాత్‌ అసెంబ్లీలో – పెద్దఎత్తున ఆందోళన చేపట్టిన – 44 మంది కాంగ్రెస్ శాసనసభ్యులను – స్పీకర్‌ రమన్‌లాల్‌ వొరా – ఒక రోజు పాటు – సస్పెండ్‌ చేశారు.

….. జమ్మూ కాశ్మీర్ లో అల్లర్లు జరుగుతున్నప్రాంత్రాలకు – కేంద్ర ప్రభుత్వం – అదనంగా – పారా మిలిటరీ బలగాలను – పంపించింది.

….. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ – ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు – ఆకాశవాణి ద్వారా – మన్ కీ బాత్ – కార్యక్రమంలో – దేశ ప్రజలనుద్దేశించి – ప్రసంగిస్తారు. ప్రధాని ప్రసంగానికి – తెలుగు అనువాదం – అదే రోజు రాత్రి 8 గంటలకు – ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లోని – అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా – ప్రసారమౌతుంది.

….. రియోలో నిర్వహించే – ఫుట్‌వాలీ-2016 ప్రపంచ టోర్నీలో – ఈసారి భారత జట్టు పాల్గొంటోంది. ఒలింపిక్‌ క్రీడల – అధికారిక బీచ్‌ స్టేడియం – కోపకబానాలో – ఆగస్టు 24 నుంచి 28వ వరకు – ఈ టోర్నీ – జరుగుతుంది.

ధన్యవాదములు ….. పోణంగి బాల భాస్కర్ …..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *