2016 AUG 24 Latest News in Telugu from Hyderabad by Bala Bhaskar

ఈ రోజు (24-08-2016) బుధవారం … నేను సేకరించి … మీ కోసం కూర్చిన … వార్తావిశేషాలు ….

….. తెలంగాణలో గోదావరి నదిపై సాగు నీటిప్రాజెక్టుల నిర్మాణానికి – మహారాష్ట్ర ప్రభుత్వంతో – కీలక ఒప్పందాలు కుదుర్చుకొని – హైదరాబాద్‌కు చేరుకున్న – ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కు – T.R.S. నాయకులు – కార్యకర్తలు – ఘనస్వాగతం – పలికారు. ఈ సందర్భంగా – ముఖ్యమంత్రి మాట్లాడుతూ – ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రెండు పంటలు పండేలా – కాళేశ్వరం నుంచి – సాగునీరందిస్తామనీ – ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరతామనీ – హామీ ఇచ్చారు.

….. అద్దె గర్భం – అంటే – సరోగసీ ముసాయిదా బిల్లుకు – కేంద్ర మంత్రివర్గం – ఆమోదం తెలిపింది. ఈ విధానాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా – మార్గదర్శకాలను రూపొందించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం – కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ – సహజీవనం చేసేవారు – స్వలింగ సంపర్కులు – జీవిత భాగస్వామి లేని, పెళ్లి కానివారు – విదేశీయులు – ప్రవాస భారతీయులకు – అద్దెగర్భం ద్వారా సంతానం పొందే అవకాశం లేదని – స్పష్టంచేశారు

….. తెలంగాణా ప్రభుత్వం తీసుకువచ్చిన – నూతన పారిశ్రామిక విధానం ద్వారా – రాష్ట్రం లోకి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయని – రాష్ట్ర IT శాఖా మంత్రి తారక రామారావు – చెప్పారు.

….. శారదా చిట్ ఫండ్ స్కాం లో – కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి P చిదంబరం సతీమణి – నళినీ చిదంబరం కు – Enforcement Directorate – సమ్మన్లు – జారీ చేసింది.

….. విపక్ష నేతలపై – పరువు నష్టం దావాలు వేయరాదని – సుప్రీమ్ కోర్టు – తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కు – సూచించింది.

….. ఆంద్ర ప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కి వ్యతిరేకంగా – తెలంగాణా ఉన్నత విద్యా మండలి దాఖలు చేసిన పిటీషన్ ను – విచారణ కు చేపట్టేందుకు – సుప్రీమ్ కోర్టు – నిరాకరించింది.

….. ఉత్తర ప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ – BJP – ఈ రోజు లక్నో లో – భారీ నిరసన ప్రదర్సన – నిర్వహించింది.

….. తెలంగాణా ప్రభుత్వం – ఏక పక్షం గా – మహారాష్ట్ర తో నీటి ప్రాజెక్టులపై ఒప్పందం కుదుర్చుకుందని – BJP తెలంగాణా శాఖ అధ్యక్షుడు Dr లక్ష్మణ్ ఆరోపించారు. ఒప్పందానికి ముందు – అఖిల పక్ష సమావేశం నిర్వహించి వుండాల్సిందని – ఆయన అభిప్రాయపడ్డారు.

….. 70 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా – హైదరాబాదు లో ఈ ఉదయం – ట్యాంక్ బ్యాండ్ పై ‘ భారత నారీ తిరంగా యాత్ర ను – కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ – ప్రారంభించారు. ఈ సందర్భంగా – ఆయన – మాట్లాడుతూ – దేశ అభివృద్ధి లో – మహిలలు – మరింత క్రియాశీల పాత్ర పోషించాలని – కోరారు.

….. అఖిల భారత సర్వీసుల అధికారులంతా – తమ ఆస్తులు – అప్పుల వివరాలను – ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ లోగా వెల్లడించాలని – కేంద్ర హోం శాఖ – ఒక ప్రకటనలో – తెలియజేసింది.

….. కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ – జమ్మూ కాశ్మీర్ లో – పర్యటిస్తున్నారు. కాశ్మీర్ లో పరిస్థితి పై – అధికారులతో – సమీక్ష జరిపారు.

….. ఈ ఏడాది జంట నగరాల్లో గణేష్ నిమజ్జనం లో – ఖైరాతాబాదు వినాయక విగ్రహాన్ని ముందుగా నిమజ్జనం చేయాలని – GHMC అధికారులు నిర్ణయించారు.

….. రేషన్‌ డీలర్ల మార్జిన్‌ను – ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెంచింది. క్వింటాలు బియ్యం, గోధుమలపై – మార్జిన్‌ను రూ.70కు పెంచింది.

….. హైదరాబాదు నాంపల్లి లోని క్రిమినల్ కోర్టు ప్రాంగణం లో ఏర్పాటైన ప్రత్యేక బాలల న్యాయస్థానాన్ని – హై కోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ – ప్రారంభించారు.

….. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ – వచ్చే ఆదివారం ఉదయం 11 గంటలకు – ఆకాశవాణి – మన్ కి బాత్ కార్యక్రమం ద్వారా – దేశ ప్రజలనుద్దేసించి ప్రసంగిస్తారు. ప్రధాన మంత్రి ప్రసంగం తెలుగు అనువాదం – అదే రోజు రాత్రి 8 గంటలకు – ప్రసారమవుతుంది.

….. ఆంద్ర ప్రదేశ్ కు చెందిన – హజ్ యాత్రికులు – ఈ రోజు – శంషాబాదు విమానాశ్రయం నుండి – జెడ్డా కు బయలుదేరి వెళ్తున్నారు. ఇందుకుగాను ఆంద్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుండి – హజ్ యాత్రికులు – హైదరాబాదు హజ్ హౌస్ కు – చేరుకున్నారు.

….. ఇటలీ లో ఈ ఉదయం సంభవించిన భూకంపం లో – మృతుల సంఖ్య 23 కి పెరిగింది. అయితే – భూకంపం వల్ల – అక్కడ వున్న భారతీయులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని – విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ – ట్విట్టర్ ద్వారా సూచించారు.

….. కర్నాటక లోని ధార్వాడ్ వద్ద నిర్మాణం పూర్తి చేసుకున్న – ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ భవనాలను – కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ – ఈ రోజు ప్రారంభిస్తున్నారు.

….. హైదరాబాద్ నగరంలో అదృశ్యమైన నలుగురు విద్యార్థులు – గోవాలో ఉన్నట్లు- పోలీసులు – గుర్తించారు. కేంద్రీయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థులు – నిన్న సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చి – ఆతర్వాత బయటికి వెళ్లి – కనిపించకుండా పోవడంతో – ఆందోళన చెందిన తల్లిదండ్రులు – పోలీస్‌స్టేషన్లలో – ఫిర్యాదు చేశారు

….. రియో ఒలంపిక్స్ లో – కాంస్య పతకం సాధించిన – సాక్షి మాలిక్ ను – “బేటీ పడావో – బేటీ బచావో” కార్యక్రమానికి – అంబాసిడర్ గా – హర్యానా ప్రభుత్వం – నియమించింది.

….. రియో ఒలింపిక్స్‌లో – భారత షూటర్ల వైఫల్యాలపై సమగ్రంగా సమీక్షించేందుకు – ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత అభినవ్‌ బింద్రా సారథ్యంలో – ఒక ప్రత్యేక కమిటీ వేయాలని – భారత జాతీయ రైఫిల్‌ సంఘం – N.R.I.A. ప్రతిపాదించింది.

….. భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారుడు లియాండర్‌ పేస్‌ – జర్మనీ క్రీడాకారుడు ఆండ్రి బెజిమెన్‌ జోడీ – విన్స్‌స్టన్‌-సేలెమ్‌ ఓపెన్‌లో – క్వార్టర్‌ ఫైనల్‌కు – చేరుకొంది. పేస్‌ తన A.T.P. చరిత్రలో 108వ భాగస్వామితో కలిసి – ఈ టోర్నీలో ఆడడం – విశేషం.

….. జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌ పోటీలు – ఈ ఏడాది అక్టోబర్ లో – విశాఖపట్నం లో – జరుగుతాయి. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత – ఆంధ్రప్రదేశ్ లో – ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు – ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు – తెలిపారు.

….. పట్నా, కోల్‌కతా, రాంచీ సరిహద్దుల్లోని – మయన్మార్‌లో – ఈ మధ్యాహ్నం – భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.8గా నమోదైంది. గువాహటిలో కూడా ప్రకంపనలు వచ్చాయి.

….. పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో – మరో 48 గంటల్లో – ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశo వుందని – వాతావారణ శాఖ తెలిపింది.

ధన్యవాదములు …. పోణంగి బాల భాస్కర్ …..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *