2016 AUG 27 Latest News in Telugu from Hyderabad by Bala Bhaskar Ponangi

నమస్కారం …. ఈ రోజు (27-08-2016) శనివారం ….  నేను సేకరించి .. . మీకోసం కూర్చిన … వార్తావిశేషాలు ….

….. గ్రామ పంచాయతీ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ – తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక ఉద్యోగుల వేతనాలు ఒక వెయ్యి 623 రూపాయల నుంచి 4 వేల రూపాయలకు – రెగ్యులర్‌ ఉద్యోగుల వేతనం 2 వేల 6 వందల రూపాయల నుంచి 5 వేల రూపాయలకు పెరగనున్నాయి.

….. మచిలీపట్నం లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో – ఉచిత డయాలసిస్ సెంటర్ ను – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ – ఈ రోజు – ప్రారంభించారు. ఈ సందర్భంగా – ఆయన మాట్లాడుతూ – కొద్ది రోజుల్లో – 35 సంవత్సరాలు దాటిన మహిళలకు – ఉచిత వైద్యం అందజేసే పధకం ప్రారంభిస్తామని – తెలిపారు. ..

….. ఆంధ్రప్రదేశ్ ను – ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని – ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని – ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు – పేర్కొన్నారు. ఆయన – ఈ రోజు – ” స్వచ్ఛ విజయవాడ ” కార్యక్రమం లో – మాట్లాడుతూ – విద్యార్థులు ప్రతి శనివారం “వనం – మనం” కార్యక్రమంలో పాల్గొనాలని – పిలుపునిచ్చారు.

….. ఈ రోజు జరిగిన – కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం – ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు – కృష్ణానది నీటిని – 63:37 నిష్పత్తిలో ఉపయోగించుకోవాలని – నిర్ణయించింది.

….. ప్రత్యేక హోదా డిమాండ్‌ – కేంద్రానికి వినిపించేలా గళమెత్తాలని – జనసేన పార్టీ – నిర్ణయించినట్లు – ఆ పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ – పేర్కొన్నారు. ఆయన – ఈ సాయంత్రం – తిరుపతి బహిరంగ సభలో మాట్లాడుతూ -ఇందుకోసం – మూడు దశల్లో పోరాటం చేస్తామని – అన్నారు.

….. వర్తమాన రాజకీయాలు, నేతలు – యువతకు మేలు చేయకపోవడం – తనకు – బాధ కలిగిస్తోందని – జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ – పేర్కొన్నారు. ఆయన – ఈ సాయంత్రం – తిరుపతి బహిరంగ సభలో మాట్లాడుతూ – ఒక దేశ సంపద అంటే – ఖనిజాలు కావని – యువతే దేశ సంపద అని – అన్నారు.

….. తెలంగాణా లో రహదారులను – 15వేల కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు – రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు – చెప్పారు.

….. భారతీయ జనతా పార్టీ – శాసనసభాపక్ష నాయకునిగా – G. కిషన్ రెడ్డి – ఈ రోజు – బాధ్యతలు చేపట్టారు.

….. BJP పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం – ఈ రోజు – డిల్లీ లో – జరిగింది. ఈ సందర్భంగా – పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ – పార్టీ విధానాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని – సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై – ముఖ్యమంత్రుల నుంచి అభిప్రాయం తీసుకున్న అమిత్‌షా – వివిధ అంశాలపై – నేతలకు – దిశానిర్దేశం చేశారు.

…. రంగారెడ్డి జిల్లా మోయినాబాదు మండలం – నజీబ్ లో “ఆయుష్ విలేజ్ “ కు – గవర్నర్ ESL నరసింహన్ – ఈ ఉదయం – శoఖుస్థాపన – చేశారు.

….. GST సవరణ బిల్లు ను చర్చించి ఆమోదం తెలిపేందుకు – తెలంగాణా శాసన సభ – శాసన మండలి – ఈ నెల 30వ తేదీన – ప్రత్యేకంగా సమావేశమవుతున్నాయి

….. ఆంద్ర ప్రదేశ్ శాసన సభ – వర్షాకాల సమావేశాలు – సెప్టెంబర్ 8వ తేదీ నుండి – హైదరాబాదు లో – జరుగుతాయి.

….. వర్షాభావ జిల్లాల్లో – 50 శాతం రాయితీ పై – రెయిన్ గన్స్ పంపిణీ చేయనున్నట్లు – ఆంద్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు – చెప్పారు .

….. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ ను – ప్రత్యేక జిల్లా గా ప్రకటించాలని డిమాండు చేస్తూ – అఖిల పక్షం ఆధ్వర్యం లో – 72 గంటల బంద్ – కొనసాగుతోంది.

….. భారతీయ రిజర్వ్ బ్యాంకు – కనీసం 2 శాతం వడ్డీరేట్లను తగ్గిస్తేనే – చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థలకు ప్రయోజనం ఉంటుందని – కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ – అభిప్రాయం వ్యక్తం చేశారు.

….. జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముప్తీ – ఈ రోజు – ప్రధానమంత్రి నరేంద్రమోదీ ని – ఢిల్లీ లోని ఆయన నివాసంలో కలుసుకుని – రాష్ట్రంలోని – శాంతి భద్రతల పరిస్థితి పై – చర్చించారు. అనంతరం – ఆమె – విలేఖర్లతో మాట్లాడుతూ – కశ్మీర్‌లో అల్లర్లకు – పాకిస్థాన్‌ ఆజ్యం పోస్తోందని – ఆరోపించారు. దాని వల్ల – ఎందరో ప్రజలు బలవుతున్నారని – ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక ప్రజల ప్రాణాలను కాపాడేందుకు – కశ్మీర్‌ వేర్పాటు వాదులు ముందుకొచ్చి – ప్రభుత్వానికి సాయం చేయాలని – మెహబూబా కోరారు.

….. ఉల్లిగడ్డల ధరలు పడిపోకుండా – రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు – ఎగుమతి సుంకం ప్రయోజనాలను – ఉల్లిగడ్డల ఎగుమతికి కూడా విస్తరించాలని – కేంద్రప్రభుత్వం – నిర్ణయించింది.

….. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన – బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు – ఈ ఉదయం లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం లో – కుటుంబసభ్యులతో కలిసి – అమ్మవారికి ప్రత్యేక పూజలు – నిర్వహించారు.

….. పాటశాలల్లో ఫీజులను తగ్గించాలని డిమాండు చేస్తూ – ఐక్య కార్యాచరణ సమితి – రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద – మౌన ప్రదర్సన నిర్వహించింది.

….. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఏడాది అక్టోబర్ 31 వ తేదీ నుంచి – ఓటర్ల నమోదు ప్రక్రియ – ప్రారంభం కానుంది.

….. గోదావరి, దాని ఉపనదులపై – సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం – మహారాష్ట్రతో ఒప్పందాలు కుదుర్చుకున్నందుకు – తెలంగాణా ప్రభుత్వాన్ని – A.I.M.I.M. అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ – అభినందించారు.

….. పొట్టి శ్రీరాములు నెల్లూర్ జిల్లా శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుండి – రేపు ఉదయం – అడ్వాన్స్డ్ టెక్నాలజీ లాంచింగ్ వెహికల్ ను – అంతరిక్షం లోకి ప్రయోగిస్తారు.

….. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో – B.J.P. పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్‌పై విచారించిన దిల్లీ కోర్టు – కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి – నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను – న్యాయస్థానం – అక్టోబర్‌ 2వ తేదీకి – వాయిదా వేసింది.

….. కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తడానికి – పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ – 22 మంది పార్లమెంట్‌ సభ్యులను నియమించారు.

….. ఇటలీలో సంభవించిన – భూకంప ధాటికి మృతిచెందిన వారి సంఖ్య – 281కి చేరింది. 388 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.- ఇటలీలో – ఈ రోజు – జాతీయ సంతాపదినంగా ప్రకటించి – మృతులకు నివాళులర్పించారు.

….. రష్యా రాజధాని మాస్కోలో – ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ శీతల గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంలో – 16మంది మృతి చెందారు.

….. గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో భాగంగా – నాయీం బాధితులను వేధించారనే ఆరోపణలతో – ఇద్దరు పోలీసు అధికారులను – సిట్‌ ఐజీ నాగిరెడ్డి – సస్పెండ్ చేశారు. నయీం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు – ఇప్పటి వరకు – 40మంది నయీం అనుచరులపై – కేసులు నమోదు చేశారు.

….. తెనాలి-విజయవాడ ప్రధాన రహదారి పై – నందివెలుగు వద్ద – ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో – ముగ్గురు వ్యక్తులు – మృతి చెందారు. అదుపుతప్పిన – రెండు ఆటోలు – ఒకదానినొకటి ఢీకొనడంతో – ఈ ప్రమాదం – చోటు చేసుకుంది.

….. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తి ని – విశాఖపట్నం పోలీసులు – ఈ రోజు – అరెష్టు చేసి – అతని వద్ద నుంచి – 120 కిలోల గంజాయిని – స్వాధీనం చేసుకున్నారు.

….. బ్రిటన్‌కు – ఇస్లామిక్ తీవ్రవాదుల బృందం నుంచి భారీ ముప్పు పొంచి ఉందని – నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. భారీగా నకిలీ పాస్‌ పోర్టులు వినియోగిస్తున్న విషయాన్ని గుర్తించిన తర్వాత – ఈ హెచ్చరికలు విడుదలయ్యాయి.

….. తెలుగు రాష్ట్రాల – 65 వ అఖిల భారత పోలీస్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు – సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు – హైదరాబాదు లోని గచ్చిబౌలి స్టేడియం లో జరుగుతాయి. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం – CISF నిర్వహించే – ఈ పోటీలను – గవర్నర్ ESL నరసింహన్ – ప్రారంభిస్తారు.

….. పశ్చిమ్‌ బెంగాల్ లోని – ముర్షిదాబాద్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో – ఈ మధ్యాహ్నం – అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో – ఇద్దరు మృతిచెందగా – మరికొందరు గాయపడ్డారు.

….. ప్రముఖ కూచిపూడి నర్తకి ఉమా రామారావు – ఈ ఉదయం అనారోగ్యం తో – హైదరాబాదు లో – మృతి చెందారు. ఆమె వయస్సు – 78 సంవత్సరాలు.

….. మాజీ క్రికెటర్, రాజ్య సభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ – రేపు ఉదయం – హైదరాబాదు లోని – గోపీచంద్ బాడ్మింటన్ అకాడెమీ లో జరిగే ఒక కార్యక్రమం లో – ఒలంపిక్స్ రజిత పతక విజేత – PV సింధు కు – BMW కారు – బహుమతి గా అందచేయనున్నారు.

….. భారత్ – వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య – తొలి T – 20 మ్యాచ్ – ఈ రోజు అమెరికా లోని ఫ్లోరిడా లో – జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం – ఈ మ్యాచ్ – ఈ రాత్రి 7 గంటల 30 నిముషాలకు – ప్రారంభమవుతుంది .

….. ప్రతిష్ఠాత్మక – U.S. ఓపెన్‌ మెయిన్‌ డ్రాకు – భారత వర్థమాన టెన్నిస్‌ క్రీడాకారుడు – సాకేత్‌ మైనేనీ – అర్హత – సాధించాడు. కీలకమైన మూడో మ్యాచ్‌లో – సెర్బియా ఆటగాడు – పెడ్జను 6-3, 6-0 స్కోరుతో – వరుస సెట్లలో – ఓడించాడు.

….. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ – రేపు ఉదయం 11 గంటలకు – ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే – మన్ కి బాత్ కార్యక్రమం లో పాల్గొని – పలు అంశాలపై – తమ అభిప్రాయాలను – శ్రోతలతో పంచుకుంటారు. ప్రధానమంత్రి ప్రసంగం – తెలుగు అనువాదం – రేపు రాత్రి 8 గంటలకు – ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లోని – అన్ని ఆకాశవాణి కేంద్రాలు – ప్రసారం చేస్తాయి.

….. తుఫానులకు సంబంధించి ” ఎక్స్ ప్రకంపన ” అనే మొట్టమొదటి ఉమ్మడి విపత్తు నిర్వహణ విన్యాసాలను – విశాఖపట్నం లో ఈ నెల 30వ తేదీ నుంచి – మూడు రోజుల పాటు నిర్వహిస్తారు,

….. ఉత్తరాంధ్ర తీరంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. కోస్తా ఆంధ్రా లో కూడా – నైరుతీ ఋతుపవనాలు – చురుగ్గా ఉన్నాయి. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణాలోని – ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని – వాతావరణ శాఖ తెలిపింది.

ధన్యవాదములు ….. పోణంగి బాల భాస్కర్ …….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *