2016 SEP 07 Latest News in Telugu from Hyderabad by Bala Bhaskar

ఈ రోజు (07-09-2016), బుధవారం … నేను సేకరించి … మీకోసం కూర్చిన … వార్తావిశేషాలు ….

….. ఆంధ్రప్రదేశ్‌కు – ప్రత్యేక ప్యాకేజీపై రూపొందించిన ముసాయిదాను – కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ – ప్రధానమంత్రి కార్యాలయానికి పంపింది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి – స్పష్టత రాగానే – కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ – రైల్వేమంత్రి సురేశ్‌ ప్రభుతో కలిసి – మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కాగా – ఈ అంశంపై చర్చించేందుకు – వెంటనే ఢిల్లీ రావలసిందిగా – కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు – ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను కోరారు.

….. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటిస్తే – మరికొన్ని రాష్ట్రాలు కూడా – ఇదే ప్రయోజనం కోసం వత్తిడి తెచ్చే అవకాశం ఉన్నందున – ఆంధ్రప్రదేశ్ కు – ప్రత్యేక హోదా బదులు – ఆర్ధిక ప్రయోజనాలను విస్తృతంగా అందించే ప్యాకేజీ ఇవ్వాలని – కేంద్రప్రభుత్వం – ప్రయత్నిస్తున్నట్లు – విశ్లేషకులు – భావిస్తున్నారు.

….. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 కింద – ప్రత్యేక ప్యాకేజీని పొందేందుకు – ఆంధ్రప్రదేశ్ తో పాటు – తెలంగాణా రాష్ట్రానికి కూడా – అర్హత ఉందని – అందువల్ల – తెలంగాణా కు కూడా – ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని – పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి – కేంద్రప్రభుత్వానికి – విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో – నూతనంగా – అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ను ఏర్పాటు చేయాలని కూడా – ఆయన – కేంద్రానికి – విజ్ఞప్తి చేశారు.

….. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు – రేపు – హైదరాబాద్ లో – ప్రారంభమౌతున్నాయి. G.S.T. రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా – ప్రభుత్వం – రేపు – ఉభయ సభల్లో – తీర్మానం – ప్రవేశపెట్టనుంది.

….. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో – Y.S.R. కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్షం – ఈరోజు – సమావేశమై – అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై – చర్చించింది.

….. తెలంగాణా రాష్ట్రంలో – రైతు బజార్లను – పటిష్టం చేయనున్నట్లు – మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు – చెప్పారు. అన్ని శాసనసభ నియోజకవర్గాలు – రెవిన్యూ డివిజన్లలో – రైతు బజార్ల ఏర్పాటుకు – ప్రణాళికలు – రూపొందిస్తున్నట్లు – ఆయన – తెలిపారు.

….. తెలంగాణలో – కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ను వేగవంతం చేసేందుకు – ప్రభుత్వం – ప్రతి జిల్లాకు – కోటి రూపాయల చొప్పున – హైదరాబాద్ మినహా – మిగిలిన 26జిల్లాలకు – నిధులు విడుదల చేసింది.

….. ప్రజల అభీష్టం ప్రకారమే జిల్లాలు ఏర్పాటు చేయాలని – కాంగ్రెస్ నాయకురాలు DK అరుణ – ప్రభుత్వాన్ని డిమాండు చేసారు. ప్రభుత్వం – రాజకీయ ప్రయోజనం కోసమే – గద్వాల్ ను – జిల్లా గా ప్రకటించేందుకు ఆసక్తి కనపరచటం లేదని – ఆమె ఆరోపించారు.

….. వచ్చే మూడు నెలల్లో – రాష్ట్రవ్యాప్తంగా – ప్రతి ఇంటికీ – డిజిటల్ డోర్ నెంబర్లు కేటాయించనున్నట్లు – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు – తెలిపారు.

….. సెప్టెంబర్ 17వ తేదీన – తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని – కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన విజ్ఞప్తిని – తెలంగాణా రాష్ట్ర సమితి తిరస్కరిస్తున్నట్లు – ఆ పార్టీ పార్లమెంటు సభ్యురాలు – కవిత – చెప్పారు.

….. భవిష్యత్తులో – క్షేత్రస్థాయిలో ఫలితాలు రాబట్టేలా – విద్యావిధానాన్ని అమలు చేస్తామని – ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో – ఈ రోజు – నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో – 139 మంది ఉత్తమ ఉపాధ్యాయులను – ఆయన సత్కరించి – ప్రోత్సాహక బహమతులు – అందజేశారు.

….. ప్రజా ప్రతినిధుల వద్ద ఉపాధ్యాయులు PA, PS లు గా కొనసాగేందుకు వీల్లేదని – సుప్రీమ్ కోర్టు – స్పష్టం చేసింది. ప్రస్తుతం PA, PS గా భాద్యతలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను – వారి పాఠశాల లకు వారం రోజుల్లోగా పంపించాలని – సర్వోన్నత న్యాయస్థానం – తెలంగాణా, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాలను – ఆదేశించింది.

….. MIM నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ హత్యాయత్నం కేసు పై – నాంపల్లి న్యాయస్థానంలో – ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా – ఒవైసీ వాంగ్మూలాన్ని- న్యాయస్థానం రికార్డ్ చేసి – తదుపరి విచారణ ను – రేపటికి వాయదా వేసింది.

….. పోలీసు స్టేషన్లలో నమోదైన – F.I.R. లను – 24 గంటల్లోగా – స్థానిక పోలీస్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని – సుప్రీం కోర్టు – స్పష్టం చేసింది.

….. సునామి పై అవగాహన కల్పించేందుకు – హైదరాబాదు లోని ఇన్ కాయిస్ సంస్థ – ఈ రోజు దేశ వ్యాప్తం గా – తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాలలో – mock drill – నిర్వహించింది.

….. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలపై ఫిర్యాదులకు – దేశమంతటా పనిచేసే – ఒకే నెంబరుతో – హెల్ప్ లైన్ ను – కేంద్రప్రభుత్వం – ఈ రోజు – ప్రారంభించింది.

….. కరీం నగర్ జిల్లా లోని సిరిసిల్ల ను – ప్రత్యేక జిల్లా గా ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తూ – అఖిల పక్షం – ఈ రోజు సిరిసిల్ల లో – మహా ర్యాలీ నిర్వహించింది. మరో వైపు – అదిలాబాదు జిల్లా నిర్మల్ ను జిల్లా గా చేయరాదని కోరుతూ – అదిలాబాదు పట్టణంలో – అఖిల పక్షం – ఈ రోజు – రహదారుల దిగ్బంధన కార్యక్రమం – చేపట్టింది.

….. భారతదేశం – త్వ‌ర‌లోనే – పెట్రోలియం ఉత్ప‌త్తుల దిగుమ‌తుల‌ను నిలిపేస్తుంద‌ని – కేంద్ర ఉప‌రితల ర‌వాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ తెలిపారు. పెట్రోలియం ఉత్ప‌త్తుల దిగుమ‌తులు లేని దేశంగా తీర్చిదిద్ద‌డ‌మే లక్ష్యంగా ప‌నిచేస్తున్నామని – ఆయన- అన్నారు.

….. వస్తు సేవల పన్ను- GST – ని – వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి అమల్లోకి తీసుకువచ్చేందుకు – అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు – కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ – చెప్పారు.

….. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి – అధికారంలోకి తీసుకొస్తే – రాష్ట్రంలో – క్యాన్సర్‌ రోగులకు – ఉచిత వైద్యం అందిస్తామని – పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ – తెలిపారు.

….. ఆంధ్రప్రదేశ్‌లో – పోలీసు కానిస్టేబుళ్లు – జైలు వార్డర్ల నియామకాల కోసం దరఖాస్తులు చేసుకొనే గడువును – ఈ నెల 21 వరకు పొడిగిస్తున్నట్లు – రాష్ట్ర పోలీసు నియామక బోర్డు వెల్లడించింది.

…. కశ్మీర్ లో – సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు – భాగస్వామ్యపక్షాలన్నింటితో చర్చలు జరపాలని – అఖిల పక్ష బృందం – కేంద్రాన్నీ, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్నీ – కోరింది. జాతీయ భద్రతా విషయంలో – రాజీపడే ప్రసక్తి లేదని – ఆ బృందం – పేర్కొంది.

….. విజయవాడ మీదుగా వెళ్లే – 215 రైళ్లను – ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు – దారి మళ్లిస్తున్నట్లు – దక్షిణమధ్య రైల్వే – ఒక ప్రకటనలో – తెలిపింది. విజయవాడ రైల్వేస్టేషన్‌లో – మౌలిక సదుపాయాల అభివృద్ధి – భద్రతను మెరుగుపర్చే పనుల దృష్ట్యా – ఈ నిర్ణయం తీసుకున్నారు.

….. దీన్ దయాళ్ గ్రామీణ విద్యుత్ యోజన కింద – పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 36 వేల విద్యుత్ కనెక్షన్లు సమకూర్చనున్నట్లు – దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చీఫ్ ఇంజనీర్ నందకుమార్ చెప్పారు. ఈ పధకం కింద కేవలం 125 రూపాయలకే – విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు – ఆయన – తెలిపారు.

….. బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్‌ సూచీ – ఈ రోజు – 52 పాయింట్లు కోల్పోయి – 28 వేల 926 పాయింట్ల వద్ద – స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్ సూచీ – నిఫ్టీ – 25 పాయింట్ల నష్టంతో – 8 వేల 917 పాయింట్ల వద్ద – ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ – 66 రూపాయల 38 పైసలుగా – కొనసాగుతోంది.

….. బక్రీద్ సందర్భంగా – పశువులను – అక్రమంగా రవాణా చేయడాన్నీ – వధించడాన్నీ – నిరోధించాలని – భారతీయ జనతా పార్టీ – తెలంగాణా ప్రభుత్వాన్ని కోరింది.

….. కరూర్‌ వైశ్యా బ్యాంకు – శత వార్షికోత్సవాలను – ఈ నెల 10వ తేదీన – చెన్నై లో – ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో – రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ – తమిళనాడు తాత్కాలిక గవర్నరు చెన్నమనేని విద్యాసాగర్‌రావు – ముఖ్య అతిథులుగా – పాల్గొననున్నారు.

….. జమ్మూ కశ్మీర్ పై తదుపరి కార్యాచరణ గురించి చర్చించేందుకు – అఖిల పక్షం – ఈ రోజు – ఢిల్లీ లో సమావేశమై – కశ్మీర్ లోయ లో – తాజా పరిస్థితి ని – చర్చించింది. వేర్పాటు వాదులతో చర్చల ప్రసక్తే లేదని – కేంద్ర హోం మంత్రి – స్పష్టం చేశారు.

….. ఆసియాన్ సదస్సు – ప్రాచ్య ఆసియా సదస్సు లకు హాజరయ్యేందుకు – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ – లావోస్ – చేరుకున్నారు. ప్రధానమంత్రి – ఈ రోజు – లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో – పది ‘ఆసియాన్‌’ దేశాల అధినేతలతో – విడివిడిగా – సమావేశం కానున్నారు.

….. శ్రీహారి కోట అంతరిక్ష కేంద్రం నుండి – GSLV అంతరిక్ష వాహక నౌక ద్వారా – Insaat 3 DR ఉపగ్రహాన్ని – రేపు సాయంత్రం 4 గంటల 10 నిముషాలకు – ప్రయోగిస్తారు.

….. బ్రెజిల్ లోని రియో డి జేనీరియో లో – ఈ రోజు – పారా ఒలంపిక్స్ – మొదలవుతున్నాయి. ఈ నెల 18వ తేదీ వరకు జరిగే ఈ పోటీలలో – 162దేశాల నుంచి అథ్లెట్లు – పాల్గొంటున్నారు. 23 క్రీడల్లోని – 528 విభాగాల్లో – ఈ పోటీలు – జరుగుతాయి.

….. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో గత 5 రోజులుగా జరిగిన – 65వ అఖిలభారత పోలీసు అధ్లేటిక్స్ పోటీలు – ఈ రోజు – ముగిసాయి.

….. ఆంధ్రప్రదేశ్ లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా – క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నాయని – విశాఖపట్నం లోని – తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు – తెలిపారు.

….. హైదరాబాద్‌లోని – హుస్సేన్‌సాగర్‌లో – గణేశ్‌ నిమజ్జనోత్సవాలు – ఈ రోజు – అధికారికంగా – ప్రారంభమయ్యాయి. నిమజ్జనం కోసం – నగరంలో – 350 క్రేన్లు – ఏర్పాటు చేశారు. 11వ రోజు నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌ వద్ద 70 క్రేన్లు అందుబాటులో ఉంచుతున్నట్లు – తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ట్యాంక్‌బండ్‌ చుట్టూ గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని – ఈ వేడుకల్లో – ప్రజలకు – ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా – అన్ని ఏర్పాట్లు పూర్తిచేసామనీ – వారు – తెలిపారు.

ధన్యవాదములు ….. పోణంగి బాల భాస్కర్ …..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *