2016 SEP 09 Latest News in Telugu from Hyderabad by Bala Bhaskar Ponangi

ఈ (రోజు 09-09- 2016) శుక్రవారం … నేను సేకరించి … మీ కోసం కూర్చిన వార్తావిశేషాలు …..

….. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై – ప్రతిపక్ష Y.S.R. కాంగ్రెస్ సభ్యులు – ఆందోళనను కొనసాగించడంతో – ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే – రాష్ట్ర శాసనసభ సమావేశాలు – రేపటికి వాయిదా పడ్డాయి.

….. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో – గత రెండు రోజులుగా – ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన తీరు అత్యంత గర్హనీయమని – ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు – అన్నారు.

….. ప్రత్యేక హోదా అంశం పై చర్చించేందుకు – ప్రభుత్వం సిద్ధంగా ఉందని – ఈ విషయంలో – రాజీపడే ప్రసక్తే లేదని – ఆంధ్రప్రదేశ్ మంత్రులు – పల్లె రఘునాధరెడ్డి – దేవినేని ఉమామహేశ్వరరావు – పేర్కొన్నారు.

….. పారిశ్రామిక కారిడార్‌ వల్ల – ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందనీ – ఉద్యోగావకాశాలు సైతం పెరుగుతాయనీ – కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ అన్నారు. రాజకీయ కారణాల వల్లే – ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై – కొందరు విమర్శలు చేస్తున్నారనీ – హోదాతో సమానమైన సాయాన్ని – కేంద్రం – ఆంధ్రప్రదేశ్‌కు చేసిందని – ఆమె – వివరించారు.

….. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యెక హోదా విషయంలో – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా – రేపు – రాష్ట్ర బంద్ నిర్వహించాలని – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – పిలుపు నిచ్చింది. కాంగ్రెస్ – వామపక్షాలు – బంద్ కు – మద్దతు – ప్రకటించాయి.

….. ఆంధ్రప్రదేశ్ కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ పై – కాంగ్రెస్ నాయకులు – జయరాం రమేష్ – J.D. శీలం – అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఐదేళ్లలో – ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చే అదనపు నిధులను ప్రకటించాలని – వారు – కేంద్రాన్ని – డిమాండ్ చేశారు.

….. ఆంధ్రప్రదేశ్ కు – ఎట్టి పరిస్థితుల్లోనైనా – ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని – సినీ నటుడు – జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ – అన్నారు. కాకినాడలో – ఈ రోజు నిర్వహించిన బహిరంగ సభలో – ఆయన – మాట్లాడుతూ – పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీలన్నింటినీ – అమలు చేయాలని – డిమాండ్ చేశారు.

….. తెలంగాణా కు కూడా – ఆంధ్రప్రదేశ్ తో సమానంగా – ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని – కాంగ్రెస్ పార్టీ – డిమాండ్ చేసింది. తెలంగాణా శాసనమండలిలో – ప్రతిపక్షనాయకుడు షబ్బీర్ అలీ – ఈ రోజు – హైదరాబాద్ లో విలేకర్లతో మాట్లాడుతూ – పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఒక్క హామీ కూడా – నెరవేరలేదని – విమర్శించారు.

….. ఆంధ్రప్రదేశ్ లో – సుమారు 4 లక్షల 69 వేల ఎకరాల్లోని – వేరుశనగ, కంది, పత్తి వంటి ఖరీఫ్ పంటలను – రక్షిత సాగునీటి పధకాలు అమలుచేయడం ద్వారా – ఈ సంవత్సరం – కాపాడగలిగామని – వ్యవసాయశాఖ మంత్రి P.పుల్లారావు – ఈ రోజు – శాసనసభలో – తెలిపారు.

….. వచ్చే ఏడాది నుంచి – విద్యార్థులకు ఇచ్చే ధ్రువపత్రాలన్నీ – డిజిటల్‌ రూపంలోనే – జారీ చేయనున్నట్లు – కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ వెల్లడించారు.

…. రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీ – ఈ రోజు నుంచి 2 రోజులు – తమినాడులో పర్యటిస్తారు. నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని – వెల్లింగ్టన్ సైనిక శిక్షణ కళాశాల – మిలిటరీ క్యాంపు లో – రేపు జరిగే కార్యక్రమంలో – రాష్ట్రపతి – పాల్గొంటారు.

….. తెలంగాణా లో – కొత్త జిల్లాల ఏర్పాటుపై – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి – ఈ రోజు జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష – నిర్వహించారు. ఈ సందర్భంగా – మండలాలు, డివిజన్లు, జిల్లా కార్యాలయాల ఏర్పాటుపై – అధికారులకు – పలు సూచనలు చేశారు. ప్రాధాన్యతల మేరకు – మెరుగైన సేవల కోసం – శాఖల ఏర్పాటు జరగాలనీ – సిబ్బంది వివరాల ప్రతిపాదనలు వెబ్‌సైట్‌లో ఉంచాలనీ – ఆదేశించారు.

….. జంటనగరాల్లో వినాయక నిమజ్జనోత్సవాలకు – 20 వేల మంది పోలీసులతో – బందోబస్తు – ఏర్పాటు చేసారు. 12 వేల సీ.సీ. కెమెరాలను – కమాండ్ కంట్రోల్ సెంటర్ కు – అనుసంధానం చేసారు. గణేష్ నిమజ్జనోత్సవం నిర్వహించే ప్రధాన మార్గం అయిన బాలాపూర్ నుంచి – ట్యాంక్ బండ్ వరకూ – దారి పొడవునా – సీ.సీ. కెమెరాలను – ఏర్పాటు చేసారు.

….. దేశీయంగా నావిగేషన్ సేవలు – త్వరలో అందుబాటులోకి తెస్తున్నట్లు – ఇస్రో – తెలిపింది.

….. జమ్ము కశ్మీర్‌ సరిహద్దు వెంబడి – గతేడాదితో పోలిస్తే – ఈ ఏడాది చొరబాట్లు పెరిగాయని – అయితే – అదే సమయంలో – భద్రతా దళాలు ఎక్కువ మంది తీవ్రవాదులను మట్టుబెట్టాయనీ – కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

….. మల్లన్న సాగర్ నిర్వాసితుల వద్ద నుండి – రాష్ట్ర ప్రభుత్వం – బలవంతంగా సంతకాలు సేకరిస్తోందని – తెలంగాణా P.C.C. అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులకు మద్దతుగా – ఈ నెల 12వ తేదీన – గజ్వేల్ లో – బహిరంగ సభ నిర్వహిస్తామని – ఆయన – చెప్పారు.

….. కావేరీ నదీ జలాలను – తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ – కర్ణాటకలో – ఈ రోజు – రైతులు – బంద్ పాటిస్తున్నారు. దీని ప్రభావంతో – బెంగుళూరు, మైసూరు వంటి నగరాల్లో – జన జీవనం – స్తంభించింది.

….. బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్‌ సూచీ – ఈ రోజు – 248 పాయింట్లు కోల్పోయి – 28 వేల 797 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్ సూచీ – నిఫ్టీ – 86 పాయింట్ల నష్టంతో – 8 వేల 866 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రోజు – డాలర్‌తో రూపాయి మారకం విలువ 66 రూపాయల 72 పైసల వద్ద కొనసాగుతోంది.

….. దేశీయ మార్కెట్లో – కిలోగ్రాము వెండి ధర – ఈ రోజు – 850 రూపాయలు తగ్గి – 46 వేల 150 రూపాయలుగా ఉంది. కాగా పది గ్రాముల బంగారం ధర – 150 రూపాయలు తగ్గి – 31 వేల 150 రూపాయల వద్ద కొనసాగుతోంది.

….. గుజరాత్‌ తీరంలోని అంతర్జాతీయ జలాల సరిహద్దు సమీపంలో – చేపల వేటకు వెళ్లిన ఆరుగురు భారతీయ మత్స్యకారులను – అరెస్టు చేసినట్లు – పాకిస్తాన్ అధికారులు తెలిపారు.

….. ప్రముఖ ప్రజా కవి కాళోజీ నారాయణరావు 102వ జయంతి సందర్భంగా – ఈ రోజు – తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా – ఆయనకు – ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతి లో జరిగిన ప్రధాన కార్యక్రమంలో – ప్రజాకవి గోరటి వెంకన్నకు – కాళోజీ పురస్కారం – ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో – సభాపతి మధుసూదనాచారి, మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్‌, నాయిని నర్సింహారెడ్డి సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ రసమయి బాలకృష్ణ, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, నారదాసు లక్ష్మణ్‌రావు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొని కాళొజీ సేవలను కొనియాడారు.

….. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో – మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం తో – తెలంగాణా లో – వచ్చే 24 గంటల్లో – అక్కడక్కడ – తేలికపాటి వర్షాలు పడవచ్చని – వాతావరణ కేంద్రం – తెలిపింది.

….. రాగల ఐదు రోజుల్లో – కోస్తాఆంధ్రా, రాయలసీమ, తెలంగాణా లో అక్కడక్కడా – తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని – హైదరాబాద్ లోని – వాతావరణ కార్యాలయం – తెలిపింది.

ధన్యవాదములు ….. పోణంగి బాల భాస్కర్ …..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *