21-09-2016, బుధవారం … నాటి వార్తావిశేషాలు …

bala bhaskar - photoకృష్ణా జలాల పంపిణీకి సంబంధించి – అపెక్స్ కౌన్సిల్ – మొదటి సమావేశం విజయవంతంగా జరిగిందని – కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి చెప్పారు.

 • కృష్ణానదీ జలాలను – నదిలో నీటి లభ్యతను బట్టి – రెండు తెలుగు రాష్ట్రాలకు – దామాషా పద్ధతిలో – పంపిణీ చేయనున్నట్లు – కేంద్ర ప్రభుత్వం – ఈ రోజు – ప్రకటించింది.
 • పాకిస్తాన్ పాల్పడుతున్న చర్యల కారణంగా – ఆ దేశానికి – అమెరికా సాయం నిలిపివేయాలనీ – పాకిస్తాన్ ను – ఉగ్రవాద ప్రోత్సాహక దేశం గా పరిగణించాలననీ కోరుతూ – అమెరికా చట్ట సభలోని –  ఇద్దరు సభ్యులు – U.S. House of Representatives లో – బిల్లు ప్రవేశపెట్టారు.
 • ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రారంభం కానున్న – నూతన ఆర్ధిక సంవత్సరానికి ముందే – పన్ను ప్రతిపాదనలు, వార్షిక ఖర్చులకు చట్టబద్దమైన ఆమోదం పొందేందుకు వీలుగా – సాధారణ వార్షిక బడ్జెట్ ను – ముందుగానే ప్రవేశపెట్టాలని – మంత్రివర్గ సమావేశం నిర్ణయించినట్లు – కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ – తెలిపారు.
 • కేంద్ర సాధారణ బడ్జెట్ లో – రైల్వే బడ్జెట్ ను విలీనం చేసేందుకు – కేంద్ర మంత్రి మండలి – ఆమోదం తెలిపింది.
 • స్వాతంత్ర్య సమరయోధులు – లేదా – వారి వారసులకు అందజేసే పెన్షన్ ను – కేంద్రప్రభుత్వం – 20 శాతం పెంచినట్లు – కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ – తెలిపారు.
 • జమ్మూ కాశ్మీర్ లోని ఉరీ, నౌగాం సెక్టార్ల లో – భారత్, పాక్ బలగాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
 • డిల్లీ పర్యటనలో భాగంగా – ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు – కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తో సమావేశమై – ప్రత్యేక ప్యాకేజీ కి చట్ట భద్దత  కల్పించాలని కోరారు.
 • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ – మన్ కి బాత్ కార్యక్రమం – ఈ నెల 25వ తేదీ – ఉదయం 11 గంటలకు – ఆకాశవాణి లో ప్రసారం కానుంది.
 • తెలుగుదేశం పార్టీ కి  చెందిన – 12 మంది శాసన సభ్యులను – అధికార తెలంగాణా రాష్ట్ర సమితి లో విలీనం చేయడం చెల్లదని – రాష్ట్ర  హైకోర్ట్ – తీర్పు చెప్పింది.  ఈ విషయంలో – తెలంగాణా శాసనసభ సభాపతి మధుసూధనాచారి నిర్ణయాన్ని – న్యాయస్థానం – తప్పు పట్టింది.
 • తెలంగాణా శాససనసభ సమావేశాలను – ప్రోరోగ్ చేయడం పట్ల – తెలంగాణా B.J.P. మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి – అసంతృప్తి వ్యక్తం చేశారు.
 • భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో – ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటల 15 నిమిషాలకు – పీ.ఎస్.ఎల్.వి  C-35 రాకెట్ ను – ప్రయోగించనుంది.
 • దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు విచారణకు నిందితుల తరపు న్యాయవాదులు గైర్హాజరు కావడంతో – కొత్త న్యాయవాదుల నియామకానికి గడువు ఇవ్వాలని -నిందితులు – కోర్టును కోరారు. దీంతో – నిందితులకు మరో అవకాశం ఇచ్చి – కేసు విచారణను – ఈనెల 26వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు – ఎన్‌ఐఏ కోర్టు – తెలిపింది.
 • టీం ఇండియా సెలక్షన్ కమిటీ చైర్మన్ గా -మాజీ క్రికెటర్ M.S.K. ప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ సందీప్ పాటిల్ పదవి కాలం ముగియటంతో – ఆయన స్థానంలో – MSK ప్రసాద్ ను – B.C.C.I.  – నియమించింది.
 • భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య – తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ – రేపు కాన్పూర్ లో ప్రారంభమవుతోంది. ఈ మ్యాచ్ – టీం ఇండియా కు – 500 మ్యాచ్ కావటం తో – ప్రాధాన్యం సంతరించుకుంది.
 • భారీవర్షాలు కురుస్తున్న కారణంగా నగరపౌరులు – అప్రమత్తంగా వుండాలని – ముఖ్యమంత్రి చంద్ర శేఖర రావు కోరారు. డిల్లీ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి – ఫోన్ లో అధికారులతో మాట్లాడి – పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే సైనిక సహాయం తీసుకోవాలని – ముఖ్యమంత్రి – అధికారులకు – సూచించారు.
 • హైదరాబాద్‌ నగరంలో – నిన్నటి నుంచీ కురుస్తున్న వర్షానికి – శివారులోని మూసీనది కాలువలు –  పొంగిపొర్లుతున్నాయి. కేతేపల్లి మండలం భీమారంలో – వంతెనపై నుంచి – మూసీ వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో – సూర్యాపేట-మిర్యాలగూడ మధ్య – వాహనాల రాకపోకలు – నిలిచిపోయాయి.
 • గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలు – హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను ముంచెత్తాయి.  రెవిన్యూ, సాగునీరు, జలమండలి, రోడ్లు-భవనాలు మొదలైన శాఖలకు చెందిన 220 అత్యవసర బృందాలు సహాయ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాయని – G.H.M.C. కమీషనర్ డాక్టర్ B. జనార్దన్ రెడ్డి చెప్పారు.  అధికారుల అనుమతి లేకుండా – రహదారుల పై మాన్ హోల్స్ తెరవ వద్దనీ – వర్షాలకు సంబంధించి – ఎటువంటి పుకార్లను నమ్మవద్దనీ – ఆయన – ప్రజలకు – విజ్ఞప్తి చేశారు.
 • రాగల 24 గంటల్లో – మరింత వర్షం కురిసే అవకాశం ఉందని – వాతావరణ శాఖ అధికారులు – తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *